మున్సిపల్ కార్మికులకు స్వెట్టర్లు పంపిణీ
టీ మీడియా,డిసెంబర్1, ఖమ్మం : స్థానిక మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కు 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ కోరిక మేరకు గురువారం టి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ స్వెట్టర్లు పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చలికాలం వల్ల వేకువజామునే విదులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు వారి ఆరోగ్యం పరిరక్షించు కొనేందుకు ఈ స్వెట్టర్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వేకువ జామున విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు డివిజన్ లను శుభ్రంగా ఉంచేలా మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
Also Read : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు విజయ్, నాగేశ్వరరావు, బుచ్చిబాబు,జవాన్ శ్రీను లతో పాటు పలువురు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.