పరీక్ష సామాగ్రి వితరణ

పరీక్ష సామాగ్రి వితరణ

1
TMedia (Telugu News) :

పరీక్ష సామాగ్రి వితరణ
టీ మీడియా, మార్చి26, మధిర: మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాల నుండి ఖమ్మంలో ఆదివారం జరగబోయే ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్స్ లను వితరణగా పాఠశాల పిఇటి గుంటుపల్లి రమాదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి సాయికృష్ణమా చార్యులు చేతుల మీదగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికృష్ణ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులు ఎన్.ఎం.ఎం.ఎస్ లో చక్కని ప్రతిభ చూపుతున్నారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకురావాల్సిందిగా విద్యార్థులను కోరారు. అదనపు తరగతులు తీసుకుని పరిక్ష కోసం విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, బానోత్ బావ్ సింగ్, వేము రాములు, పి లక్ష్మి , గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తాత మధుసూధన్ కు వినతిపత్రం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube