కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ వితరణ

కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ వితరణ

2
TMedia (Telugu News) :

కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ వితరణ

టీ మీడియా, మార్చి 26, ధర్మపురి :జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం లోని నేరేళ్ళ గ్రామంలో గల , తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకుకు, మినరల్ వాటర్ త్రాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో, నేరేళ్ళ, గోవిందుపల్లె, ఉమ్మడి గ్రామలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సంబేట మల్లేశం, అదే ఉమ్మడి గ్రామంలో గ్రామ పంచాయతీ కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న సంబేట రాము, దాహార్తిని తీర్చాలని తల్లి జ్ఞాపకార్ధంగా, నేరేళ్ళ గ్రామంలో గల స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకు సిబ్బందికి, సుమారు పది వేల రూపాయలకు పైగా విలువ కలిగిన, కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ ను, బ్యాంకు మేనేజర్ రమేష్ కు అందజేయడం జరిగింది అని తెలిపారు. వీరిని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ సాయి క్యాషియర్ శ్రీధర్ లతో పాటు బ్యాంకు సిబ్బంది, ఉన్నత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు అయినా, పదవ తరగతి మిత్ర బృందం సభ్యులు, తదితరులు అభినందించారు.

Also Read : నగరానికి 49.49 కోట్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube