వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రవి నాయక్

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రవి నాయక్

0
TMedia (Telugu News) :

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రవి నాయక్

టీ మీడియా ఫిబ్రవరి 3 మహబూబ్నగర్ బ్యూరో : మన ఊరు- మనబడి కింద పూర్తయిన పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేయాలికంటి వెలుగు పథకం కింద వైద్య శిబిరాలకు వచ్చేలా ప్రజలను చైతన్యం చేయండి
తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగనాలకు స్థలాలను గుర్తించాల్సిన చోట తక్షణమే గుర్తించాలి, క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలి పోడు భూముల కింద గుర్తించిన వారికి పట్టాలు ఇచ్చేందు సిద్ధం చేయాలి- జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్ ఆదేశం మన ఊరు- మనబడి కింద జిల్లాలో చేపట్టిన పాఠశాల పనుల వేగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అయన నూతన కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించరు జిల్లాలో మన ఊరు- మనబడి కింద 291 పాఠశాలలను చేపట్టడం జరిగిందని, వీటిలో మొదటి విడత 32 మోడల్ పాఠశాలలను చేపట్టామని, 20 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, గడిచిన 2 రోజుల్లో 4 పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ పనులన్ని పూర్తయిన పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేయాలని, సంబంధిత శాసనసభ్యుల తో సమయం తీసుకుని ప్రారంబానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 2 పాఠశాలలైన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సివిల్ పనులు పూర్తయిన చోట పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు .ఎఫ్ పి ఓ ల ను ఏరోజుకారోజు జనరేట్ చేయాలని చెప్పారు. మన ఊరు- మనబడి కింద చేపట్టిన పనులన్నింటిని వేగవంతం చేసి ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి మొత్తం 291 పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించారు .కంటి వెలుగు పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజలు వచ్చే విధంగా మొబిలైజషన్ చేయాలని జిల్లా సంక్షేమ అధికారి, డిపిఓ, డిఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.

Also Read : రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నధి

కాగా కంటి వెలుగు కింద ఇప్పటి వరకు 72,975 మందిని పరీక్షించడం జరిగిందని, 9780 మందికి రీడింగ్ అద్దాలు ఇచ్చామని, 7620 మందికి ప్రెస్క్రిప్షన్ అద్దాలను రెఫర్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ వెల్లడించారు.తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల సమీక్ష సందర్భంగా జిల్లాలో మొత్తం 441 గ్రామపంచాయతీలు, 224 హాబిటేషన్లకుగాను 333 జిపి లు,హాబీటేషన్లకు స్థలాలను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తక్కిన గ్రామపంచాయతీలు, హాబీటేషన్ లలో తక్షణమే స్థలాలను గుర్తించాలని, ఈ విషయంలో తాహసిల్దారులు, ఎంపీడీవోలు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని చెప్పారు. గ్రామంలో ఎక్కడ స్థలాలు లేని చోట ప్రభుత్వ సంస్థలు లేదా పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలకు స్థలం చూడాలని, 249 క్రీడా ప్రాంగణాలు పూర్తి కాగా వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. గ్రామాలలో యువజన సంఘాలను, యువకులు ఆసక్తి ఉన్నచోట నమోదు చేస్తే క్రీడా ప్రాంగణాలు ఉపయోగంలోకి వస్తాయని అన్నారుపోడు భూములపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ పోడు భూములకు సంబంధించి గుర్తించిన అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావు, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్ ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, డిఆర్డిఓ యాదయ్య ,డిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారిని జరిన బేగం, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, జిల్లాఅటవీ శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చత్రు నాయక్, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube