హిందూసేన లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ గా భూమి రమణ

హిందూసేన లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ గా భూమి రమణ

1
TMedia (Telugu News) :

హిందూసేన లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ గా భూమి రమణ

టీ మీడియా, మార్చి 26, జగిత్యాల జిల్లా : జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ హిందూసేన లీగల్ సెల్, జగిత్యాల జిల్లా కో కన్వీనర్ గా, ప్రముఖ న్యాయవాది, భూమి రమణ కుమార్ ను నియమిస్తూ, రాష్ట్రీయ హిందూసేన తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ లంక మురళి కృష్ణ, శనివారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఎల్లప్పుడూ హిందూ ధర్మం కోసం, న్యాయం కోసం, అండగా ఉండాలని, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ సూచించినట్లు, భూమి రమణ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భూమి రమణ మాట్లాడుతూ…. రాష్ట్ర శాఖ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన, గురువు పరిపూర్ణానంద స్వామి, రాష్ట్రీయ హిందూ సేన జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డికి, సహకరించిన ప్రతిఒక్కరికి, భూమి రమణ కుమార్, కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : దేవాలయ నిర్మాణానికి సహకరించండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube