జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగదినోత్సవ వేడుకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 26, కర్నూలు జిల్లా:

72వ భారత రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం పేరడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా ఎస్పీ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి , భారత రాజ్యాంగం పీఠిక ను చదివి వినిపించి పోలీసు అధికారులు మరియు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.
1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణ అని, రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తూ దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్, హోంగార్డు కమాండెంట్ యు. రామ్మోహన్, డిఎస్పీలు మహేష్, ఇలియాజ్ భాషా, రవీంద్రా రెడ్డి, డిపిఓ ఎఓ సురేష్ బాబు, ఎస్పీ పిఎ నాగరాజు, సిఐలు శ్రీనివాసరెడ్డి, పార్ధసారథి రెడ్డి , ఆర్ ఐలు వియస్ రమణ, సురేంద్రా రెడ్డి, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, డిపిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Constitution day celebrations at District Police Office.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube