– మణుగూరు ఎఎస్పీ శబరీష్
టీ మీడియా,డిసెంబర్ 2,కరకగూడెం:
క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మణుగూరు ఎఎస్పీ డాక్టర్ శబరీష్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామం నందు కరకగూడెం,పినపాక మండలాల స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహించారు.

ఈ టోర్నీని ముఖ్య అతిధిగా హాజరై ఎఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎఎస్పీ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ ఉన్న గ్రామీణ యువతను గుర్తించి డివిజన్ స్థాయిలో ఆటలు ఆడిస్తామని అన్నారు.

అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.టోర్నీలో సుమారు 45 జట్లు పాల్గొన్నాయి.కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం ఆర్ఐ భాస్కర్,సీఐ రాజ గోపాల్, కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్, ఏడూళ్ళ బయ్యారం ఎస్సై సూరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube