దళితులను విభజిస్తే తీవ్ర పరిణామాలు

దళితులను విభజిస్తే తీవ్ర పరిణామాలు

1
TMedia (Telugu News) :

దళితులను విభజిస్తే తీవ్ర పరిణామాలు

టీ మీడియా, జూలై 12, వనపర్తి బ్యూరో : తెలంగాణ మాలమహనాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ స్థానిక జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సాతర్ల శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు హాజరై మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో దళితులను విభజిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్వార్ధ రాజకీయాల కోసం దళితులను విభజించి పాలించే విధానాన్ని బిజెపి అనుసరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొన్ని పార్టీల నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం తెర మీనికి చేస్తున్నారని మండిపడ్డారు.

 

Also Read : దడ పుట్టిస్తున్న శిథిల భవనాలు

ఎస్సీ  వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మాలలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. వర్గీకరణ అంశాన్ని బిజెపితో పాటు అన్ని రాజకీయ పార్టీలు విడిచిపెట్టి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కడం రాఘవేందర్, జిల్లా కార్యదర్శి బ్యాగరి శ్యాంసుందర్, జిల్లా ప్రచార కార్యదర్శి కాడం వెంకటేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ మాసయ్య, పట్టణ అధ్యక్షుడు సాతర్ల శివకుమార్, కథలయ్య, నరేష్, శ్రీనివాసులు, బ్యాగరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube