ఎన్‌కౌంటర్‌లో డివిజన్‌ కమిటీ కమాండ్‌ మృతి

ఎన్‌కౌంటర్‌లో డివిజన్‌ కమిటీ కమాండ్‌ మృతి

1
TMedia (Telugu News) :

ఎన్‌కౌంటర్‌లో డివిజన్‌ కమిటీ కమాండ్‌ మృతి
టి మీడియా,ఆగస్టు1,రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ని సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలోమావోయిస్టులు,భద్రతాబలగాలమధ్యఎదురుకాల్పులుజరిగాయి.ఈకాల్పుల్లోఓమావోయిస్టుతుచనిపోయాడు.సోమవారంఉదయంభందర్‌పదర్‌గ్రామసమీపంలోనిబెజ్జీఅటవీప్రాంతంలోజిల్లారిజర్వ్‌గార్డులుమావోయిస్టులకోసంగాలిస్తున్నారు.ఈక్రమంలో ఉదయం 7.30 గంటల సమయంలో గాలింపు బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.

 

Also Read  : ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం షురూ

 

మృతుడిని మాడ్‌ డివిజన్‌ కమిటీ కమాండర్‌ హడ్మా అలియాస్‌ సంకుగా గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది వెల్లడించారు., గత పదిరోజుల వ్యవధిలో సుక్మా జిల్లాలో కాల్పులు చోటుచేసుకోవాడం ఇది మూడోసారి. మూడు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. జులై 29న బింద్రపాణి గ్రామంలో, పల్బగాడి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube