డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

0
TMedia (Telugu News) :

డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

టీ మీడియా, డిసెంబర్ 28, చెన్నై: డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్‌ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండు రోజుల క్రితం విజయ్ కాంత్ నిమోనియాతో ఆసుపత్రిలో చేరారు. విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మియాట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. సదరు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న జన్మించారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘ఇనిక్కుం ఇలామై’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎక్కువగా ఆయన తన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించారు. విజయకాంత్‌ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలవడం ఆరంభించారు.

Also Read : ప్రజాపాలన సభలు పగడ్బంధీగా నిర్వహించాలి..

విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దీంతో విజయ్ కాంత్‌కు తెలుగునాట కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని విజయ్ కాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube