వ్యాయామం చేయండి

జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండండి

1
TMedia (Telugu News) :

వ్యాయామం చేయండి

-జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండండి

టీ మీడియా, మే28, మధిర:మధిర మండలం మాటూరు పేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నక్కలగరుబు, వెంకటాపురం గ్రామాలలో 30 సంవత్సరములు దాటిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి వారికి తగిన మందులను నెలకు సరిపోను ఇచ్చి జీవనశైలి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బీపీ షుగర్ పరీక్షలు ప్రతి మూడు నెలలకు ఒక సారి చేయించుకో వలెనని, అలానే షుగర్ బిపి ఎక్కువ రోజులు బాధపడుతున్నవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని, అన్ని రకాల రక్త పరీక్షలు మాటూరు పేట ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నందు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు.

Also Read : సి.సి రోడ్డు శంకుస్థాపన

అలానే రాబోయే వర్షాకాలంలో ప్రతి ఇల్లు, పరిసరాలు,కులర్ లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వారానికి రెండుసార్లు డ్రై పాటించాలని, దివాటరింగ్ చేయాలని తద్వారా దోమలు కుట్టకుండా, పుట్టకుండా చూసుకోవాలని, డి వాటరింగ్ చేయటం వలన దోమల వృద్ధిని అరికట్టవచ్చని డెంగ్యూ జ్వరాలు నివారించవచ్చని తెలిపారు. ఈ క్యాంపు నందు ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు భాస్కర్ రావు, మరియా రాణి, సుభాషిని, మహిళా ఆరోగ్య కార్యకర్తలు టి సరస్వతి ,టి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube