పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దు

పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల ప‌రిశీల‌న‌

1
TMedia (Telugu News) :

పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దు

-పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల ప‌రిశీల‌న‌

-కార్మికులతో కలిసి మురుగు తొలగించిన మంత్రి పువ్వాడ.

-హరితహారం కోసం డివిజన్లోని నర్సరీ లను పరిశీలన

టి మీడియా, జూన్6,  ఖమ్మం: కొనసాగుతున్న పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దని, పూర్తి స్ధాయిలో ఆయా పనులు పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అధికారులను అదేశించారు.ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా సోమవారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు.36వ డివిజన్ PSR రోడ్డులో కాల్వలో మురుగు తొలగించే పనులను ప్రారంభించారు. గాంధీ చౌక్ సెంటర్ లో రోడ్డు మరమ్మత్తు పనులను పారతో స్వయంగా చేశారు. 50వ డివిజన్ రాపర్తి నగర్ లో కచ్చా నాళ ను శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. చెత్త చెదారం తొలగించి పూర్తి స్థాయిలో బాగు చేయాలన్నారు.51, 52వ డివిజన్ NSP క్యాంపులో ప్రభుత్వ భూములను శుభ్రం చేసి సంరక్షించాలని అన్నారు. చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు. 16వ డివిజన్ లక్ష్మి గార్డెన్స్ ఎదురుగా నూతనంగా ఎర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.ఆయా పనుల్లో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప‌రిష్కారం, పురోగ‌తిపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులు కూడా ప్రాథమిక బాధ్యతగా చేపట్టాలని ఆదేశించారు.ఈ సంధర్భంగా వారు మాట్లడుతూ..అభివృద్దితో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు నేరుగా అందుతున్నాయ‌ని, వాటిని స‌కాలంలో అర్హులైన వారంద‌రికీ అందేలా చూసే బాధ్య‌త అధికారుల‌దేనని స్ప‌ష్టం చేశారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణాల్లో ఎన్నో అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప‌ల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తప్పక పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

 

Also Read : అక్రమ పునాదులు పై అపార్టుమెంటు

 

మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని సీజ‌న‌ల్ వ్యాధుల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్ర‌కృతి వనంలు, నర్సరీల కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌ని, కొన్ని డివిజన్లలో అనుకున్న ప‌నులు బాగా జరుగుతుండగా, కొన్ని డివిజన్లలో జ‌ర‌గ‌డం లేద‌ని, అధికారులు అల‌స‌త్వం వీడాల‌న్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ గారు ముందుచూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఆభివృద్ధి పరుస్తున్నారని అన్నారు.అనంతరం14, 16, 36, 40, 41, 42, 45వ డివిజన్లోని నర్సరీ లను పరిశీలించారు. వచ్చే హారితహరం కార్యక్రమం కోరకు ప్రభుత్వ లక్ష్యానికి మించి మొక్కలు సిద్దం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు పసుమర్తి రామ్ మోహన్, రాపర్తి శరత్, కమర్తపు మురళి, శీలంశెట్టి రమా వీరభద్రం, రాపర్తి శరత్, మేడారపు వెంకటేశ్వర్లు, మక్బూల్, బుర్రి వెంకట్ కుమార్, వలరాజు, నాయకులు పగడాల నాగరాజు, RJC కృష్ణ, తహశీల్దార్ శైలజ, మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube