సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకండి

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకండి

1
TMedia (Telugu News) :

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకండి

లహరి,నవంబర్15,హైద్రాబాద్ : నేటి కలియుగంలోనూ మంగళవారం రోజున గోళ్లను కత్తిరించొద్దు.. వెంట్రుకలను కట్ చేసుకోవద్దు.. షేవింగ్ చేసుకోవద్దు.. శుక్రవారం అప్పులు ఇవ్వొద్దు.. మంగళవారమే అప్పులు తీర్చాలని చెబుతూ ఉంటారు. అయితే ఇలా అస్తమానం వారు చెబుతుంటే చాదస్తం అని ఇప్పటి యువత పెద్దగా పట్టించుకవోడం లేదు. అయితే అవన్నీ హిందూ మత అద్యాత్మిక గ్రంథాలలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి.


మన ఇళ్లలో పెద్దవారు మనకు తరచుగా కొన్ని విషయాలను చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మమ్మ, నాన్నమ్మ ఉండే ఇళ్లలో పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు ఉంటారు. నేటి కలియుగంలోనూ మంగళవారం రోజున గోళ్లను కత్తిరించొద్దు.. వెంట్రుకలను కట్ చేసుకోవద్దు.. షేవింగ్ చేసుకోవద్దు.. శుక్రవారం అప్పులు ఇవ్వొద్దు.. మంగళవారమే అప్పులు తీర్చాలని చెబుతూ ఉంటారు. అయితే ఇలా అస్తమానం వారు చెబుతుంటే చాదస్తం అని ఇప్పటి యువత పెద్దగా పట్టించుకవోడం లేదు. అయితే అవన్నీ మన హిందూ మత గ్రంథాలలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. దానికి వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం సూర్యాస్తమయం కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read ; పెళ్లి సందడి జీవితంలో మధురమైన జ్ఞాపకంగా వుండాలి

​తులసిని తాకొద్దు..

మనలో చాలా మంది ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. నిత్యం తులసి పూజ చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్యా వేళలో తులసిని తాకడం, తులసి ఆకులను తెంచడం వంటివి చేయకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట.
​చీపురు వాడరాదు..
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ సూర్యుడు అస్తమయం అయిన తర్వాత చీపురును పొరపాటున కూడా వాడరాదట. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు. పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే సూర్యస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీకు అన్ని శుభ ఫలితాలొస్తాయి.

​ఇవి ఇవ్వొద్దు..

జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం కలియుగంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు, పెరుగు, పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇవన్నీ చంద్రుడికి ప్రతీకగా ఉంటాయి. అందుకే సంధ్యా వేళలో తెల్లని వస్తువులను ఇవ్వరాదు. ఒకవేళ ఇస్తే మీకు మనశ్శాంతి అనేది కరువవుతుందని చాలా మంది చెబుతారు. వీటితో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా ఇవ్వకూడదు.

Also Read : 20 నుంచి తిరుచానూరు పద్మావతి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

అప్పులివ్వొద్దు..
సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదే విధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

​చెత్త విషయంలో జాగ్రత్త..
సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లో బయట వేయకూడదు. కేవలం ఉదయం పూట మాత్రమే వేయాలి. మీరు పొరపాటున సాయంకాలం వేళలో చెత్తను బయటకు వేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని నమ్ముతారు. అలాగే సాయంకాలం వేళలో మీ ఇంటికి ఎవరైనా ఆతిథ్యం స్వీకరించడానికి వస్తారో.. వారిని ఒట్టి చేతులతో బయటకు పంపకూడదు. తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి.

Also Read : వెదురు బియ్యం.. మహాభాగ్యం

​గోళ్లను, కురులను కత్తిరించొద్దు..

సాయంకాలం సంధ్యా వేళలో హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడొచ్చు. వైవాహిక బంధంలో ఉండే వారు ఈ సమయంలో కలయికలో పాల్గొనకూడదు. పొరపాటున సాయంకాలం వేళ ఆ కార్యంలో పాల్గొంటే, వారికి పుట్టే పిల్లల బుద్ధి ప్రతికూలంగా ఉంటుందట.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube