ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దు

సిఐటియు , రైతు సంఘం లడిమాండ్

2
TMedia (Telugu News) :

ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దు

-సిఐటియు , రైతు సంఘం లడిమాండ్
టీ మీడియా,సెప్టెంబర్ 14,కడప:
ప్రభుత్వ రంగంలోని ఎరువుల సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు . బుధవారం కడప నగరంలోని పాత బస్టాండ్ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిర్ణయం అమలులోకి వస్తే రైతులపై తీవ్ర భారం పడుతుందని, కార్మిక వర్గం కూడా రోడ్లపాలు పడతారని వారు తెలిపారు . మానిటైజేషన్ పైప్ లైన్ విధానం వల్ల ఎరువుల కంపెనీలను ప్రైవేటుపరం చేస్తే వ్యవసాయ రంగానికి నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : అంగన్వాడీ ఆశా,స్కీం వర్కర్ల మహా ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్

ప్రైవేట్ కంపెనీలు లాభా పేక్షతో ధరలను పెంచి రైతాంగం పై పెనుబారం మోపుతాయని పేర్కొన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం దెబ్బతిని ఆహార ధాన్యాల కోసం విదేశాలపై ఆధారపడి దుస్థితి వస్తుందని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల వ్యవసాయం ధ్వంసం అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు , కార్మిక వర్గాన్ని రక్షించేందుకు ఎరువుల కంపెనీలను ప్రైవేటుపరం చేసే విధానాలకు స్వస్తి పలకాలని పెరిగిన ఎరువుల ధరలను తగ్గించి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని ఎరువుల ధరలు కూడా అదుపులో ఉంచగలిగారని బ్లాక్ మార్కెట్ నివారించబడి రైతులకు అందుబాటులో ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి లక్ష్మీదేవి నగర నాయకులు విజయ్ , శ్రీనివాసరెడ్డి రైతు సంఘం నాయకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube