యాదవ వన సమారాధనజయప్రదం చేయండి

-మేకల మల్లిబాబు యాదవ్

1
TMedia (Telugu News) :

యాదవ వన సమారాధనజయప్రదం చేయండి

-మేకల మల్లిబాబు యాదవ్

టీ మీడియా, నవంబరు 10, సింగరేణి : ఈనెల 13న ఖమ్మం చెరుకూరి గార్డెన్స్ లో యాదవ వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 13న జరిగే యాదవ వన సమారాధన కార్యక్రమం ప్రచారం నిర్వహణలో భాగంగా సింగరేణి మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు. యుగాల చరిత్ర కలిగిన బలమైన గొప్పదైన యాదవ కులం ప్రపంచవ్యాప్తంగా 4% ఉన్నారని, దేశవ్యాప్తంగా 22% ఉన్నారని భారతదేశంలో బీసీలలో అతిపెద్ద కులమైన యాదవ కులం అఖిల భారత యాదవ మహాసభ అండదండలతో ఈరోజు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది .ఎంతోమంది రాజకీయ నాయకుల్ని పండితుల్ని మేధావుల్ని తయారు చేసింది.

Also Read : ఆర్డీవో ఆఫీసులోరైల్వే లైన్స భూసేకరణకు సర్వే

ఇదంతా యాదవుల సంఘటితం వలన సాధ్యపడిందని పేర్కొన్నారు. యాదవులను చైతన్యం చేయాలనే చేయాలనే సదుద్దేశంతో కార్తిక యాదవ్ వన సమారాధన ఉత్సవాల్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డగోడు ఐలయ్య మేకల కుమార్ ఇమ్మడి తిరుపతిరావు ఇమ్మడి సీత, మారబోయిన రామచంద్రయ్య,తోకల సాయి పెద్ది బోయిన సురేష్,ఇది గాని సాయి, బచ్చలకూరి ఉపేందర్ ఇదిగాని ఉపేందరు, డేగల ఉపేందర్, తోకల సతీష్ పాలిక లింగయ్య, వీరన్న సతీషు పాలిక ముత్తయ్య, నల్లమాద రమేష్ మేకల మల్లయ్య, కేత మల్ల శీను పాలిక వీరయ్య రడబోతు రాము, తోకల సాయి పాలిక శీను, అరికెల సాయి జిట్టబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube