ఘనంగా డాక్టర్స్ దినోత్సవం

ఘనంగా డాక్టర్స్ దినోత్సవం

1
TMedia (Telugu News) :

ఘనంగా డాక్టర్స్ దినోత్సవం

టీ మీడియా, జూలై 1, వనపర్తి బ్యూరో : జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ప్రజా డాక్టరు డాక్టర్ బాలకిష్టయ్యకి అఖిలపక్ష ఐక్యవేదిక,జిల్లా ఆసుపత్రుల సూపరిడెంట్, హాస్పిటల్ ఇన్చార్జ్ లతో కలిసి పూలదండ వేసి పూజా కార్యక్రమంతో నివాళులర్పించడం జరిగింది.
భారతరత్న డా. బిధాన్ చంద్ర రాయి పుట్టినరోజు చనిపోయిన రోజు ఒకటే కావడంతో ఆయన జయంతి రోజున జాతీయ డాక్టర్స్ డే గా ప్రకటించి డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది. ఆయన మహాత్మా గాంధీకి పర్సనల్ డాక్టర్ గా ఉండేవారు బెంగాల్ సీఎంగా కూడా పనిచేశారు ఆయన సేవను గుర్తించుకోవడానికి ఆయన పుట్టినరోజు డాక్టర్ డే ప్రకటించారు.

Also Read : టీఎస్‌ టెట్‌ ఫలితాలు విడుదల

ఈ రోజున వనపర్తి ప్రజా డాక్టర్ డాక్టర్ బాలకృష్ణయ్య కూడా బింద్ర రాయ్ గారి సేవలకు గుర్తుగా ఉన్నారని అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా డిఎంహెచ్వో డాక్టర్ రవి శంకర్ కి, మెడికల్ కాలేజ్ సూపర్డెంట్ నంద కుమార్ కి, హాస్పిటల్ ఇన్చార్జ్, రాజకుమార్ కి అఖిలపక్ష ఆయుర్వేదిక తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రోగ్రాంలో సివిల్ హాస్పిటల్ డాక్టర్లతో పాటు ఐక్యవేదిక నాయకులు చిరంజీవి వెంకటేష్ షఫీ వైయస్సార్ సతీష్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్ శివశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube