డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర దంప‌తులు మ‌న‌కు గ‌ర్వంకార‌ణ‌

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ

1
TMedia (Telugu News) :

డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర దంప‌తులు మ‌న‌కు గ‌ర్వంకార‌ణ‌

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ

టీ మీడియా,మార్చి 30న్యూఢిల్లీఃప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లు డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల తెలుగువార‌వ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు అభిప్రాయ‌ప‌డ్డారు. సామాన్య రైతు కుటుంబంలో జ‌న్మించి, ఫార్మారంగంలో అసామాన్య స్థితికి ఆయ‌న చేరుకున్నార‌ని వివరించారు. డాక్ట‌ర్ కృష్ణ ఎల్ల‌, సుచిత్ర ఎల్ల దంప‌తుల‌ను టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా నామ నాగేశ్వ‌రరావు మాట్లాడుతూ… కృష్ణ ఎల్ల మాదిరిగానే తాను కూడా రైతు కుటుంబంలో జన్మించాన‌ని, తామ ఎంచుకున్న రంగాలు ఏవైనా, ప్రాధాన్యతలు వేరు అయినప్పటికి ప్రజా సేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో ఈ రోజు ప్ర‌జ‌ల ముందు ఉన్నామ‌ని గుర్తు చేశారు.

ALSO READ;గాంధీ’లో కల్లు బాటిళ్ల కలకలం పట్టుకున్న సెక్యూరిటీ గార్డులు

ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి కృష్ణ ఎల్ల అని కొనియాడారు. హెపటైటిస్-బితో కలిపి ఎన్నో వ్యాధులకు టీకాలు కనిపెట్టారని గుర్తు చేశారు. అంతేకాకుండా యావత్ ప్రపంచాన్ని కబలించిన కరోన వైర‌స్ కు వ్యాక్సిన్ కనుగొనడంలో ఆయన పాత్ర కీలకమ‌ని చెప్పారు. కోవాగ్జిన్ వంటి టీకా తయారు చేసి భారత్‌ను అగ్రదేశాల సరసన నిలిపారన్నారు. మనదేశం నుంచి వచ్చిన, పూర్తి స్వదేశీ టీకా కోవాగ్జిన్ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ గుర్తింపుతో పాటు ఎన్నో దేశాల్లో ప్రజలను కాపాడిందని తెలిపారు. భారత్ బయోటిక్‌ను స్థాపించి ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఫార్మాసంస్థగా నిలపడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఆయన సాధించిన ప్రగతి కేవలం అవార్డుల‌తో స‌మానం అనుకోవడం కాకుండా ఆయన సమాజానికి చేసిన సేవ అవార్డులు కంటే మిన్నగా తాను భావిస్తున్నాన‌ని వివ‌రించారు. త‌న మిత్రడు ఇంత ప్రగతి సాధించింనందుకు వ్యక్తిగతంగా అభినందిస్తూ హర్షిస్తున్నానని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు వెల్ల‌డించారు.

ALSO READ;ఇంగ్లీష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు సిద్ధమవ్వాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube