సామాజిక సేవకుడు సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 18, గోదావరిఖని :

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా చేపడుతున్న పలు సామాజిక సేవలను గుర్తించి సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ సురభి శ్రీధర్ కు,ఆసియా వేదిక్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను శనివారం అందించారు.ఆసియా వేదిక్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు లోని హోసూర్ లో శనివారం ఏర్పాటు చేసిన డాక్టరేట్ కార్యక్రమంలో ఈ డాక్టరేట్ అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆగర్భ అగోర్ ఫౌండేషన్ చైర్మన్ ఆగోర్ భానత్ ఆగోరీ,మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ ఎన్.ఎస్.వాసుదేవా, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకులరమేష్,బుల్స్ ఆచారి అకాడమీ డైరెక్టర్ వి.బాబు విజయన్,తెలంగాణ బిసి సంక్షేమ సంఘం జయశంకర్ జిల్లా అధ్యక్షులు బండారి దేవేందర్,ఆసియా వేదిక్ కల్చర్ పౌండేషన్ చైర్మన్ సీ మార్గరేట్ అముల్ చేతుల మీదుగా డా,సురభి శ్రీధర్ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు.సురభి శ్రీధర్ కు డాక్టరేట్ రావడం పట్ల పలు స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు పలు సంఘాల బాద్యులు హర్షం వ్యక్తం చేశారు, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన డా,సురభి శ్రీధర్ తెలిపారు.

Doctorate inauguration for social worker Surabhi Sridhar.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube