టీ మీడియా, అక్టోబర్ -25 ఏటూరునాగారం
ములుగు జిల్లా
ఏటూరునాగారం మండలం లోని సామాజిక వైద్యశాలలు ఈ ఘటన చోటు చేసుకుంది. వాజేడు గ్రామానికి చెందిన
మరబోయినా కుమారి వయసు.23
భర్తకృష్ణయ్య.26.
మూడు రోజుల క్రితం కుమారికి పురిటి నొప్పులు రావడంతో ఏటూర్ నాగారం సామాజిక వైద్యశాలకు తీసుకురావడం జరిగింది,
ఆస్పత్రిలో చేర్చిన రోజునే పురిటినొప్పులు అధికం కావడంతో అందుబాటులో ఉన్న ఎంబిబిఎస్ వైద్యులు ఆపరేషన్ చేయగా కుమారికి పండంటి బిడ్డ జన్మించింది. రెండు రోజులు రెండు రోజులు నిలకడగా ఉన్న పాప ఆరోగ్యం,

సోమవారం విషమించింది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని వారి అమ్మమ్మ వైద్యుల వైద్యులకు తెలుపగా అందుబాటులో ఉన్న డాక్టర్ ఎం బి బి ఎస్ రాహేల్ ప్రాథమిక ప్రాథమిక చికిత్స చేస్తుండగా అప్పటికే ప్రాణం పోయిందని తెలపడం జరిగింది, ఆపరేషన్ చేసిన డాక్టర్ ను వివరణ కోరగా తనకేమీ తెలియదని సూపర్డెంట్ గారిని అడగమని అక్కడ నుండి వెళ్లిపోయారు, అయితే తమ పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రసూతి వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఎంబిబిఎస్ వైద్యులే ఆపరేషన్ చేయడం నిపుణుల పర్యవేక్షణ లేకపోవడంతో మా పాపను కోల్పోవడం జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
