డాక్యుమెంటరీ రగడ
-నేడు ఢిల్లీ వర్సిటీలో మోదీపై బీబీసీ సిరీస్ స్క్రీనింగ్ బీబీసీ
టీ మీడియా,జనవరి27,న్యూఢిల్లీ : బీబీసీ డాక్యుమెంటరీ రగడ తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)ని తాకింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఇండియా : ది మోదీ క్వశ్చన్ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని డీయూ నార్త్ క్యాంపస్ వెలుపల శుక్రవారం సాయంత్రం ప్రదర్శించనున్నట్టు కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐ, భీం ఆర్మీ స్టూడెంట్స్ ఫెడరేషన్ సహా పలు విద్యార్ధి సంఘాలు వెల్లడించాయి. మరోవైపు డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను విద్యార్ధి సంఘాల నిరసనలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని డీయూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. బీబీసీ డాక్యుమెంటరీ లింక్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడాన్ని వామపక్ష విద్యార్ధి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2002లో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలు చూపడంపై తాము విచారణ చేపట్టాలనే పేరుతో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బీబీసీ డాక్యుమెంటరీ లింక్స్‌ను తొలగించాలని సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, యూట్యూబ్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి దశదిశా లేని ఈ డాక్యుమెంటరీ వలసవాద ధోరణితో తెరకెక్కిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దుయ్యబట్టింది.
Also Read : ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన జమున: సీఎం కేసీఆర్
ఈ డాక్యుమెంటరీ లింక్స్‌ను బ్లాక్ చేయడం ప్రసారమాధ్యమాలపై సెన్సార్‌షిప్ విధించడమేనని విపక్షాలు కేంద్రం తీరును ఆక్షేపించాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్ధల క్యాంపస్‌ల్లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని విపక్షాల విద్యార్ధి అనుబంధ సంఘాలు పిలుపు ఇచ్చాయి. జేఎన్‌యూ క్యాంపస్‌లో మంగళవారం డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు వర్సిటీ అధికారులు విద్యుత్, ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారని, స్క్రీనింగ్ జరుగుతుండగా ఏబీవీపీ విద్యార్ధులు రాళ్లు రువ్వారని విద్యార్ధులు నిరసనలు చేపట్టారు. మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు జామియా మిలియా ఇస్లామియాలో 13 మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube