పోడు భూములుకు హక్కు పత్రాలు ఇవ్వాలి

పోడు భూములుకు హక్కు పత్రాలు ఇవ్వాలి

1
TMedia (Telugu News) :

పోడు భూములుకు హక్కు పత్రాలు ఇవ్వాలి

టీ మీడియా , మార్చి 16 ,దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం మండల పరిధిలోని మంగవాయిబాడవ గ్రామంలో , పోడు సాగు దారుల జనరల్ బాడీ సమావేశం గ్రామ పెద్ద కల్లూరి బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ఆదివాసీలు తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అలాగే ఆదివాసీలు భూములు జోలికొస్తే ఊరుకోమని అని టిఆర్ఎస్ ప్రభుత్వం , స్పందించి వెంటనే సర్వే చేసి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా అసెంబ్లీ సమావేశంలో చర్చ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీలు అందరు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నమెంట్ ఆదివాసీలను మోసం చేస్తుందని, హామీ ఇచ్చి మర్చిపోయింది అని ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు మళ్ళి ఫారెస్ట్ అధికారులు లాక్కునే విధముగా ప్రయత్నం చేయిస్తుందని ఇదే గనుక జరిగితే టిఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని లేదంటే ఆదివాసులు తరతరాలు గా పోడు భూములు నమ్ముకొని వ్యవసాయం ఆధారం మీద బతుకుతున్న వారికి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేదంటే మరో పోడు భూమి పొలికేక పోరాట కార్యక్రమాలు చేపడతామని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు, గ్రామ గ్రామాన పర్యటనలు చేయాలని అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎఫ్ ఆర్ సి గ్రామ కమిటీలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆ బాధ్యత ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామ సభ జరగకుండా ఫారెస్ట్ అధికారులు పోడు జోలికి వెళ్లకూడదని వారు గుర్తు చేశారు ఈనెల 28 29 తేదీలలో జరిగే గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెలో కార్మిక కర్షకులు పెద్ద ఎత్తున గ్రామీణ బందులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ దేశంలో బిజెపి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి అనేక కార్మిక చట్టాలను వ్యవసాయ తుంగలో తొక్కి మత రాజకీయాలకు పాల్పడుతోందని, బిజెపి ని గద్దె దింపాలి అంటే లౌకిక వాద శక్తుల అందరూ ఏకం కావాలని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు.

Also Read : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే భర్తీ చేయాలని అలాగే కే.జి గిరి వికాస పథకం దరఖాస్తులు తేదీని పొడిగించాలని లేదంటే, ఆ ప్రాంత ఆదివాసులు వ్యవసాయ బోర్లు త్రి ఫేస్ కరెంటు సౌకర్యాల్ని కోల్పోతారని అందుకని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి గిరి వికాస పథకం తేదీ ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరినీ పోడు సాగు దారులను రైతులను ఐక్యం చేసి ఆందోళనా పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు అలాగే ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు ప్రభుత్వం కేటాయించడం లేదని వెంటనే కేటాయించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని , పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోర్స చిలకమ్మ, మర్మం చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు కల్లూరి వీరభద్రం తుర్రం సుబ్బారావు, భద్రయ్య,నాగమణి,పోడియం రాధ,తుర్రం వెంకటేశ్వర్లు, శ్రీను పార్వతీ ఇంకా తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube