ముట్టుకోవడం వల్ల కుష్టు వ్యాధి వస్తుందా..

ముట్టుకోవడం వల్ల కుష్టు వ్యాధి వస్తుందా..

0
TMedia (Telugu News) :

ముట్టుకోవడం వల్ల కుష్టు వ్యాధి వస్తుందా..

లహరి, ఫిబ్రవరి1, ఆరోగ్యం : కుష్టు వ్యాధి.. చేతులు, కాళ్లు మెలితిప్పనట్లు చర్మం పూర్తిగా వంగిపోతుంది. ఇది ఓ అంటువ్యాధి. ఇది ఎలా వస్తుంది. ట్రీట్‌మెంట్ ఏంటో తెలుసుకుందాం. దీని గురించి మరిన్ని వివరాలు డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం.కుష్టు వ్యాధి.. ఈ పేరు చెప్పగానే అదో రకమైన భయం ఉంటుంది. ఇది అంటరాని సమస్యగా ఉంటుంది. ఇది సోకిన వారిని ముట్టుకోవడానికి, దగ్గరికి వెళ్ళడానికే చాలా మంది భయపడతారు. వారిని అందరికీ దూరంగా ఉంచుతారు. ఈ సమస్య వచ్చిందంటే చర్మం, చేతులు, కాళ్ళ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇది నిజంగానే ముట్టుకుంటే ఒకరి ద్వారా ఒకరికి వస్తుందా. ఇలాంటి వివరాలన్నీ న్యూఢిల్లీలోని జివిషా క్లినిక్ డెర్మటాలజిస్ట్ ఆకృతి గుప్తా మాటల్లో తెలుసుకుందాం.

ముట్టుకుంటే వస్తుందా..
డాక్టర్ ఆకృతి గుప్తా ప్రకారం, కుష్టు వ్యాధి కేవలం రోగి చర్మాన్ని ముట్టుకోవడం వల్ల ఈ వ్యాధి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వదు. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, పక్కపక్కనే కూర్చోవడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా వ్యాధి వచ్చిన వారితో ఎక్కువగా ఉండడం వల్ల వారి ముక్కు, నోటి నుండి వచ్చే బిందువుల ద్వారా వస్తుందని చెబుతారు. ఇప్పుడు దీనిని కూడా చాలా వరకూ తగ్గించొచ్చు. ఇందుకోసం సమస్య మొదలవ్వగానే వ్యాధి సోకిన వారికి దగ్గరగా ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్యులతో టెస్ట్ చేయించుకోవడం మంచిది.

వ్యాధి రావడానికి కారణాలు..

ఈ వ్యాధి మైకోబ్యాక్టిరియం లెప్రే, మైకోబ్యాక్టీరియం లెప్రోమాటోసిస్ వల్ల వచ్చే ఓ అంటువ్యాధి. ఇది రావడానికి కచ్చితమైన కారణాలు లేవు. కుష్టు వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నప్పుడు వారు దగ్గినా, తుమ్మిన, లెప్రే బ్యాక్టీరియాతో కూడిన బిందువులు వ్యాప్తి చెందుతాయి. ఇవి దగ్గర్లోని వ్యక్తులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి.కుష్టు సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు, పక్కపక్కన కూర్చోవడం, షేక్ హ్యాండ్స్ చేయడం, కౌగిలించుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
తరచుగా తలనొప్పి వస్తుందా..

Also Read : మంచినీళ్లు తాగడానికి కూడా టైమ్ కావలి..!

లక్షణాలు..
చర్మంపై ప్యాచెస్‌లా రంగు మారుతుంది
ఈ ప్యాచెస్ ఫ్లాట్‌లా మారి తిమ్మిరి, రంగు మారుతుంది
చర్మం మందంగా గట్టిగా మారి డ్రై అవుతుంది
పాదాల అరికాళ్ళపై నొప్పి లేని బొబ్బలు
ముఖం, చెవులపై నొప్పిలేని వాపులు
కనుబొమ్మలు, జుట్టు రాలడం
స్కిన్‌పై ప్రభావిత ప్రాంతాల్లో తిమ్మిరి
కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతం
దృష్టి సమస్యలు
మాట్లాడడంలో ఇబ్బంది
ముక్కుకారడం
చర్మంపై నోడ్యూల్స్
పాదాలపై నొప్పి లేని పూతలు
ముఖం, చెవిలోబ్స్‌పై నొప్పిలేని గడ్డలు, వాపు
చర్మంపై లేత రంగు మచ్చలు

ట్రీట్‌మెంట్..
కుష్టు వ్యాధిని తగ్గించొచ్చు. కొన్ని డేటా ప్రకారం గత రెండు దశబ్దాలలో కుష్టు వ్యాధితో బాధపడుతున్న 16 మిలియన్ల మంది సమస్య నుంచి కోలుకున్నారు. అయితే, ఈ ట్రీట్‌మెంట్ అనేది కుష్టు వ్యాధి రకాన్ని బట్టి ఉంటుంది. యాంటీబయాటిక్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాడతారు.దీనిని తగ్గించేందుకు డాక్టర్స్ సాధారణంగా లాంగ్‌టర్మ్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. అంటే 6 నెలల నుండి ఓ సంవత్సరం వరకూ యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఎక్కువగా ఉంటే మరింత సమయం ఎక్కువగా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది..
ట్రీట్‌మెంట్ చేయకపోతే..
కుష్టు వ్యాధికి ట్రీట్‌మెంట్ చేయకుండా వదిలేస్తే చర్మం, నరాలు, చేతులు, పాదాలు కళ్ళు శాశ్వతంగా దెబ్బతింటాయి.

Also Read : టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

దీని కారనంగా
కంటిచూపు పోవడం, గ్లకోమా
ఇరిటిస్
జుట్టురాలడం
పిల్లలు పుట్టకపోవడం
ముఖం వికారంగా మారడం(వాపు, గడ్డలు)
పురుషుల్లో అంగస్తంభన, ఇన్‌ఫెర్టిలిటీ
కిడ్నీ ఫెయిల్యూర్
కండరాల బలహీనత
చేతులు విడదీసినట్లుగా మారడం
కాళ్ళు వంచలేకపోవడం
ముక్కు లోపల సమస్యలు
చేతులు, కాళ్ళు సహా మెదడు, వెన్నుపాము నరాలకు శాశ్వతంగా సమస్యలు
​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube