నూతన ఆలయ నిర్మాణానికి దాతల విరాళం

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 14 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని సూరవీడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానాకి విరాళంగా సూరవీడు గ్రామానికి చెందిన దొడ్డి రామారావు-మహలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కోడలు దంపతులు దొడ్డి.లక్ష్మీనారాయణ-లక్ష్మి లు ఆలయ నిర్మాణానికి విరాళంగా ఒక లక్ష పదకొండు వందల పదహారు రూపాయల నగదును ఆలయ కమిటీకి అందించడం జరిగింది. ఈసందర్భంగా ఆలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నగదును విరాళంగా అందించిన దాతలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆలయ నిర్మాణానికి దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి శ్రీను , లక్మనరావు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Donar decoration for construction of new people.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube