అన్నదానం చేసిన కాటికపరులు

టీ మీడియా, మార్చి 9,ఖమ్మం

1
TMedia (Telugu News) :

అన్నదానం చేసిన కాటికపరులు
టీ మీడియా, మార్చి 9,ఖమ్మం:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో భాగంగా ఖమ్మం కాల్వ ఒడ్డు మహాప్రస్థానం కు చెందిన జాంబవంతుడు సొసైటీ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి బాలు ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న వృద్ధ యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చెరుకుపల్లి బాలు మాట్లాడుతూ మహిళలు నిరంతర శ్రామికులు.సృష్టికి మూలం స్త్రీ.మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.

Also Read :  ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలపై

ప్రతి ఒక్కరు మహిళలను గౌరవిస్తూ వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ కందుకూరి నాగేశ్వరరావు, అశోక్,కుక్కల వెంకటేశ్వర్లు,సైదులు,పడిశాల వీరస్వామి,కుక్కల రాములు,చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube