రక్తదానం మరియు రొట్టెల పంపిణీ

రక్తదానం మరియు రొట్టెల పంపిణీ

1
TMedia (Telugu News) :

రక్తదానం మరియు రొట్టెల పంపిణీ

 

టీ మీడియా, నవంబర్ 19, చింతూరు : ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ చింతూరు మండల కమిటీ వారు శనివారం రక్తదానం మరియు రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంచడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మరియు ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ మరియు డైరెక్టర్ గారైన శ్రీ జయశాలి పిడి సుందర్ రావు గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఈ యొక్క కార్యక్రమమును చేయడం జరిగింది.

Also Read : పార్క్ లో పండ్ల మొక్కలు నాటిన కౌన్సిలర్

ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ గారైన రవి గారు మాట్లాడుతూ మా ఆత్మీయ తండ్రిగారైన శ్రీ జయశాలి పి.డి సుందర్ రావు గారి జన్మదిన ఈనెల 20వ తేదీన దానిని గుర్తు చేసుకుంటూ ముందుగానే ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఏసుక్రీస్తు చేసినటువంటి బోధనలే ఇటువంటి కార్యక్రమాలకు కారణమని ఏసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడని అందుకే సమాజంలో ఉన్నవారికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube