ఆలయమునకు విరాళం అందించిన మండల వ్యవసాయ అధికారిని

ఆలయమునకు విరాళం అందించిన మండల వ్యవసాయ అధికారిని

0
TMedia (Telugu News) :

ఆలయమునకు విరాళం అందించిన మండల వ్యవసాయ అధికారిని

టీ మీడియా, నవంబర్ 19, జగిత్యాల జిల్లా: కొడిమ్యాల మండల కేంద్రంలోని నూతనంగా పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు ధర్మపురి పట్టణానికి చెందిన కొడిమ్యాల మండల వ్యవసాయ(A E O) అధికారినిగా విధులు నిర్వహిస్తున్న కోరుట్ల మంజుల-గంగాధర్ వీరి సంతానం విక్రమాదిత్య, మహాలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు రాజన్న-లక్ష్మీ నరసమ్మ ల కుటుంబం శాశ్వత చందాదారులుగా 25,116/-(ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలను) విరాళంగా అందజేసినారు.

Also Read : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

వీరికి అర్చకులు నాగరాజు రమేష్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి మంగళ శాసనములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు, నిర్మాణ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఇట్టి విరాళం అందజేసిన దాతలకు ఆలయ నిర్మాణ కమిటీ మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube