క్యాన్సర్ బాధితుడికి విరాళo -టీ మీడియా బోనకల్

0
TMedia (Telugu News) :

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన వేల్పుల హనుమంతు ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యారని ఆళ్లపాడు గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు అన్నారు.గత ఐదు సంవత్సరాల క్రితం పంచాయతీ గుమాస్తాగా విధులు నిర్వహించారని,ఆర్ధిక సహాయంగా వారి ఆరోగ్యం పూర్తిగా తగ్గాలని, వారికి అన్ని విధాలా ఆళ్లపాడు సిపిఎం గ్రామ శాఖ అండగా ఉంటుందని తమవంతు సహాయంగా 5000 రూపాయలు అందచేశారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, అలీ బంధువులు, మరియు ఫ్రెండ్ తరుపున అతనికి ఆరోగ్య నిమిత్తం 25000-/లు మండల పంచాయతీ అధికారి చేతుల మీదుగా ఇచ్చారు.హనుమంతరావు చాలా సంతోషకరంగా మాట్లాడుతూ నన్ను గుర్తుచుకొని నాకు ఈ సహాయం చేసినవారి అందరికి ధన్యవాదములు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతి రావు, మాజీ సర్పంచ్ పార లక్ష్మి, నారాయణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube