దేవాలయమునకు విరాళం అందజేసిన ఆలయ కమిటీ సభ్యుడు

దేవాలయమునకు విరాళం అందజేసిన ఆలయ కమిటీ సభ్యుడు

1
TMedia (Telugu News) :

దేవాలయమునకు విరాళం అందజేసిన ఆలయ కమిటీ సభ్యుడు

టీ మీడియా, అక్టోబర్ 28, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండల కేంద్రంలో నూతనంగా పునః నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు కొడిమ్యాల గ్రామానికి చెందిన కొండూరి కొండయ్య- శోభారాణి (LIC ఏజెంట్ )గారి చిన్న కుమారుడు ఆలయ కమిటీ సభ్యుడు కొండూరి ప్రవీణ్ -రాధిక గారి సంతానం శివ నాగ సాద్విక, శివ నాగ ప్రణయ భాస్కర్ కూతురు శివ నాగ సాద్విక పుట్టినరోజు సందర్భంగా శాశ్వత చందాదారులుగా 25,016/-(ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు) విరాళం అందజేసినారు.

Also Read : హాట్‌టాపిక్‌గా ఫామ్‌హౌజ్‌ ఘటనలో ఆడియో

ఇట్టి విరాళం అందజేసిన దాతల కుటుంబానికి అర్చకులు నాగరాజు రమేష్ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి మంగళ శాసనములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు, నిర్మాణ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఇట్టి విరాళం అందజేసిన దాతలకు ఆలయ నిర్మాణ కమిటీ మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube