మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దు

మదన్ లాల్ గెలుపు పక్కా

0
TMedia (Telugu News) :

మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దు

– మదన్ లాల్ గెలుపు పక్కా

– కాంగ్రెస్ వల్ల అయ్యేదేది లేదు

– మూడోసారి కేసీఆర్ సీఎం కావడం తథ్యం

– ఎంపీ నామ నాగేశ్వరరావు

టీ మీడియా, నవంబర్ 18, కొణిజర్ల : ఒక్క చాన్స్ అంటూ మాయ , మోసపు మాటలు చెబుతున్న వారిని నమ్మి ఆగం కావొద్దని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ , వైరా నియోజకవర్గ ఇంచార్జి నామ నాగేశ్వరరావు అన్నారు.వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం కొణిజర్ల మండలం అంజనాపురం, గుబ్బగుర్తి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ పదకొండు సార్లు పాలించిన కాంగ్రెస్ మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వండని అడగడంలో అర్థం లేదన్నారు. పాలించిన కాలంలో ప్రజలకు ఏమి చేయని ఆ పార్టీ ఇప్పుడొచ్చి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తుందని అన్నారు. ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దని అన్నారు. వారి హయాంలో కరెంట్, నీళ్లు, పెట్టుబడులు లేక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు.

Also Read : కొత్తకోటలో బిస్పీ పార్టీలో మైనార్టీ మహిళలు చేరిక

కేసీఆర్ నేతృత్వంలో ఈ పదేళ్ళలో రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి జరిగిందన్నారు. రైతు బంధు , ఉచిత విద్యుత్ తో రైతుల కష్టాలు తీరియన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచి జనం నడ్డి విరిచారని, ఈ విషయమై తాను పార్లమెంట్ లో ఎన్నో సార్లు పోరాడినా పట్టించు కోలేదన్నారు. అందుకే కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రాగానే రూ.800 భారాన్ని భరించి, రూ. 400 కే గ్యాస్ బండ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరేనని , ఇక్కడ మదన్ లాల్ గెలవడం ఖాయమని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో మండల కోర్ కమిటీ సభ్యులతో పాటు పార్టీ మండల అధ్యక్షులు చిరంజీవికార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, రైతు బంధు నాయకులు కిలారు మాధవరావు, నాయకులు పోట్ల శ్రీను, జెట్పీటీసీ పోట్ల కవిత , పొగుల శ్రీనివాసరావు, పాసంగులపాటి శ్రీనివాసరావు,

Also Read : 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించారు

మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడపోతుల బాబు , తనికెళ్ల సర్పంచ్ చల్లా మోహన్ రావు, జెట్పీ కో అప్షన్ మోళనా, బోయినపల్లి కృష్ణమూర్తి,అంజనాపురం , గుబ్బగుర్తి సర్పంచ్ లు నాగజ్యోతి రాంబాబు, మీర్జా రోషన్ బేగ్, ఉప్పలచెలక సర్పంచ్ మాన్ సింగ్, సామినేని నర్సయ్య, బోజరాజు, పాపారావు, మోరంపూడి ప్రసాద్, నామ సేవా సమితి నుంచి చీకటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుబ్బగుర్తిలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఎంపీ నామ సందర్శించి, పూజలు చేశారు.అనంతరం చర్చిని కూడా సందర్శించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube