ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు
– ఎమ్మెల్యే శంకర్ నాయక్
టీ మీడియా, నవంబర్ 2, మహబూబాబాద్ : కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు కొత్త కొత్త నాయకులు మీ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మొసపోవద్దని గుర్తు చేసారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం గూడూరు మండలం దామరవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలతో పాటు ఎదామరవంచ ఎంపీటీసీ నునవత్ స్వాతి రవి నాయక్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గాదె వెంకట్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నునావత్ ఈర్యా, గ్రామ మహిళ అధ్యక్షురాలు భూక్య పద్మ, గ్రామ వార్డు సభ్యులు, తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ గెలుపు కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుడిగా భావించి, భవిష్యత్తులో సముచిత స్థానం గౌరవం ఇస్తానని తెలిపారు. దామరవంచ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చెయ్యాలని సూచించారు.
Also Read : ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే మా లక్ష్యం
రానున్న 28 రోజుల్లో పార్టీ కోసం కష్టపడండి, వొచ్చే 5 సంవత్సరాలు పార్టీ మీకోసం కష్టపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరే వీరన్న, రాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులు బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా జడ్పీ కోఆప్షన్ ఎండీ ఖాసీం, మండల అధ్యక్ష కార్యదర్శులు, వెంకట్ కృష్ణారెడ్డి, నూకల సురేందర్, ముక్క లక్ష్మణ్ రావు, సంపత్ రావు, కోడి రవి, ఉప సర్పంచ్ సత్తి రెడ్డి, గాదె నరసింహ రెడ్డి, రాఘవ రెడ్డి పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube