ముంపు బాధితులను పట్టించుకోని పాలకులు

రైతు సంఘం అధ్యక్షుడు జిఎస్ గోపి

1
TMedia (Telugu News) :

ముంపు బాధితులను పట్టించుకోని పాలకులు

-రైతు సంఘం అధ్యక్షుడు జిఎస్ గోపి

టి మీడియా ,జూలై 25,రేవల్లి:  రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో ఏదుల రిజర్వాయర్లు కదా ఏడు సంవత్సరాల కిందట 976 కుటుంబాలు ముంపునకు గురై రోడ్డున పడిన బాధిత కుటుంబాలను ఆదుకోకపోవడం అన్యాయమని అదేవిధంగా పునరావాస కేంద్రంలో బడికి బడి గుడికి గుడి వ్యవసాయ భూమికి వ్యవసాయ భూమి సకల వసతులు కల్పించి తర్వాత ముంపు బాధితులను ఆదుకోవాలని స్థానిక మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ముంపు బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేకుంటే గ్రామం నుండి వనపర్తి వరకు పాదయాత్రలో కూడా పాల్గొంటామని తెలియజేశారు.

 

Also Read : మొక్కను నాటిన ఉప సర్పంచ్.

అదేవిధంగా కలెక్టర్ గారికి లేఖ సమర్పిస్తామని రైతు సంఘం అధ్యక్షుడు జిఎస్ గోపి దీక్షా శిబిరం నుంచి డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ రోజు దీక్షలో గోపాల పర్వతాలు గూపని చెన్నయ్య గుపని బాలపీరు మిద్దె నిరంజన్ గడిగోపుల నరసింహ ధర్మారెడ్డి మంగ దొడ్డి బాలింగాయ దాసరి నర్సయ్య సాంబశివుడు మోటూరు మల్లయ్య రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు మా సమస్యలను పరిష్కరించకపోతే పాదయాత్ర కూడా వెనకాడబోమని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని గ్రామ ప్రజలు తెలియజేయడమైనది ఈ భాగంగా గ్రామ యువత అదేవిధంగా గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube