నన్ను చూసేందుకు రావ్వొద్దు.. నేనే మీ ముందుకు వస్తా

- బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌

0
TMedia (Telugu News) :

నన్ను చూసేందుకు రావ్వొద్దు.. నేనే మీ ముందుకు వస్తా

– బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌

టీ మీడియా, డిసెంబర్ 12, హైదరాబాద్‌ : తుంటి గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తనను చూసేందుకు యశోద ఆసుపత్రికి దయచేసి రావ్వొద్దని కోరారు. తనతో పాటు వందలాది మంది పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదన్నారు. ఇన్ఫెక్షన్‌ సోకుతుందని వైద్యులు తనను బయటకు పంపడం లేదన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొని మీ ముందుకు వస్తానన్నారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌ నుంచి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Also Read : గ్యారెంటీలలో మరికొన్ని డిసెంబర్‌ 28 నుంచి అమలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube