అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా

అధైర్యపడొద్దు.. అండగా నేనుంటా

0
TMedia (Telugu News) :

 

– మృతుల కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపిన మంత్రిహరిశ్ రావు

సిద్దిపేట పట్టణంలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ మంత్రి హరీశ్ రావు భరోసా

సిద్ధిపేట 15 జనవరి 2022 అధైర్య పడొద్దు.. అండగా నేనుంటానని, అన్నీ విధాలుగా ఆదుకుంటానని, అండగా నిలుస్తామని రోదిస్తున్న మృతుల కుటుంబీకులలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మనోధైర్యాన్ని నింపి భరోసా ఇచ్చారు. సిద్ధిపేట పట్టణంలో పలువురు మృతుల కుటుంబాలను శనివారం పరామర్శించిన మంత్రి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read:నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌

– బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్తిరి శ్రీనివాస్ తల్లి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 13వ వార్డు బీడీ కాలనీలోని శ్రీనివాస్ నివాసంలో వారి కుటుంబీకులను మంత్రి పరామర్శించారు.

– రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నిర్మించిన మేస్త్రీ పిట్ల నర్సింలు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి అధైర్యపడొద్దని, ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తెస్తే ఆదుకుంటామని భరోసా ఇచ్చి మేస్త్రీ నర్సింలు కుటుంబీకులకు మంత్రి మనో ధైర్యాన్ని నింపారు.

– సిద్ధిపేట కోటి లింగేశ్వర ఆలయ అర్చకులు రాజు పంతులు తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

– తొగుట రిటైర్డ్ ఏస్ఐ భూమ లింగం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు భూమ లింగం నివాసంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు.

Also Read:బ్రతుకున్న కూతురి కి. దశ దిన కర్మలు.

– పట్టణ టీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు మోయిజ్ తమ్ముడు ఇటీవల వివాహమైన సందర్భంగా వారి నివాసంలో కలిసి నూతన వధూవరులకు మంత్రి హరీశ్ రావు షాదీ ముబారక్ చెప్పారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, తెరెసా పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సుడా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube