బడి మాకొద్దయ్య  బడికి బై…బై…

ఇంటికి తీసుకువెళ్తూన్న తల్లీ దండ్రులు

1
TMedia (Telugu News) :

బడి మాకొద్దయ్య  బడికి బై…బై…

-ఇంటికి తీసుకువెళ్తూన్న తల్లీ దండ్రులు
టీ మీడియా, సెప్టెంబర్17,భూర్గుంపాడ్ : భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధినీ మేఘన అదృశ్యం అయి అదే పాఠశాలలో ఓ గదిలో దొరకడంతో పాఠశాల పై తీవ్ర అనుమానాలు విద్యార్థినీ కుటుంబ సభ్యుల్లో రేకెత్తిస్తున్నాయి. పాఠశాల టిచ్చర్లే మా బిడ్డను చంపాలని చూశారని వారి సొంత గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు.

Also Read : చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాద శక్తులు

ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు అని ఇలా ఐతే మా బిడ్డల పరిస్ఠితి కుడా ఇలానే ఉంటుంది అని మా బిడ్డలను మా ఊరు తీసుకు పోతాము అని బ్రతికి ఉంటే బలుసాకు అయిన తీని బ్రతుకుతారనీ ఇలాంటి రాక్షస టీచ్చర్ల బడి మాకొద్దయ్య అని దండం పెట్టీ విధ్యర్ధునిల తల్లిదండ్రులు దాదాపు 10 మంది విద్యార్థులను ఇంటికి తీసుకు వెళ్ళారు.మరి కొందరు విద్యార్ధినీ లను కూడా ఈ ఆశ్రమ పాఠశాల నుండి వారి తల్లిదండ్రులు తిసుకుపోనున్నట్టు సమాచారం.మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఎలా స్పందించనున్నారో చూడాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube