బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’

బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’

0
TMedia (Telugu News) :

‘బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’

– సిఎం జగన్‌

టీ మీడియా, డిసెంబర్ 8, తిరుపతి : ” తుపాను బాధితులకు ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చామని, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోం ” అని సిఎం జగన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ తిరుపతిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో నేరుగా మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ … ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందన్నారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారని చెప్పారు. సాయం కోసం 92 రిలీఫ్‌ కేంద్రాలను పెట్టామని ప్రకటించారు. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్‌ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చామని, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోమని సిఎం జగన్‌ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థ ఎపిలో ఉందన్నారు. ప్రతీ ఇంటికి వాలంటీర్‌ వచ్చి రూ.2,500 ఇస్తారని చెప్పారు.

Also Read : ప్రజల కష్టాలు మరో మూడు నెలల్లో తొలగిపోతాయి

పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదన్నారు. స్వర్ణముఖిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. వారంలో అందరికీ సాయం చేస్తానన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆందుకుంటామని, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సిఎం జగన్‌ భరోసానిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube