అపరిచిత లింకులను ఓపెన్ చేయరాదు

సిఐ కరీముల్లా ఖాన్

1
TMedia (Telugu News) :

అపరిచిత లింకులను ఓపెన్ చేయరాదు

-సిఐ కరీముల్లా ఖాన్

టీ మీడియా,మే 27, జన్నారం:అపరిచిత మెసేజ్లలో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని లక్షట్ పేట సిఐ కరిముల్లా ఖాన్ అన్నారు. మండలంలోని కవ్వాల్ గ్రామంలో గురువారం రోజున రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ ,జన్నారం ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ఆత్మహత్యలు ,ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కరిముల్లా ఖాన్ మాట్లాడుతూ… అపరిచిత మెసేజ్లలో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని, అలాగే యువత గంజాయి, మత్తు బారిన పడకుండా వారి భవిష్యత్తు దృశ్య ఆలోచన చేయాలని, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని..

Also Read : గ్యాస్ లీకేజ్ లు పునరావృతం కాకుండా చర్యలు

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లకు కష్టపడి ఉద్యోగం సంపాదించాలని సూచించారు.చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు అయినట్లయితే ఇలాంటి ఉద్యోగశాలు రాక ఇబ్బంది పడతారని తెలియజేశారు. అలాగే కవ్వాల్ గ్రామ యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, గ్రామ యువత, గ్రామ పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube