డిగ్రీ కళాశాల విద్యార్థులకు నష్టం జరగద్దు

మెడికల్ కళాశాల అనుమతి పొందాలి

1
TMedia (Telugu News) :

డిగ్రీ కళాశాల విద్యార్థులకు నష్టం జరగద్దు

-మెడికల్ కళాశాల అనుమతి పొందాలి

టీ మీడియా,ఏప్రిల్ 08 గోదావరిఖని : పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని గత కొన్ని ఏళ్ల నుండి ఈ ప్రాంత ప్రజల తరఫున విద్యార్థి, యువజన,స్వచ్ఛంద సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు,వాటి అనుబంధ సంఘాల నాయకులు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి,ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మెడికల్ కళశాల అని ప్రభుత్వాలకు విన్నవిస్తూ,పోరాటాలు ఉద్యమాలు చేస్తూ మెడికల్ కళాశాల సాధించుకోవడం అభినందనీయమని మద్దెల దినేష్ అన్నారు.గురువారం మెడికల్ కళశాల ప్రినిసిపాల్ ఛాంబర్ లో వారిని కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వ డిగ్రి కళశాల విద్యార్థులకు నష్టం జరగవద్దు అని మెడికిల్ కళశాల అనుమతి రద్దు కావువద్దు అని ఓక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సూచించామని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను మెడికల్ కళాశాలగా మార్చుతున్నారని విద్యార్థులు ఇబ్బందులకు గురై వారు అనేక రకాలుగా నిరసనలు తెలపడం జరిగిందన్నారు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెడికల్ కళాశాల కోసం పెర్మనెంట్ గా ఎట్టి పరిస్థితిలో తీసుకోమని విద్యార్థులను అవగాహన కల్పించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఎలాంటి ఇబ్బందులు కలగవని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు తెలిపారు.

Also Read : సింధు తపస్విని సన్మానించిన ఎమ్మెల్యే వనమా

వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,విద్యార్థులతో తో స్వయంగా చర్చించి వారికి నమ్మకం కలిగించేలా చూడడం శుభపరిణామం అన్నారు.కళాశాలకు ఎన్ ఎం సి ద్వారా అన్ని రకాల అనుమతులు పొందేలా ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు అన్నీ వర్గాల ప్రజలు సహాకరించుకొని మెడికల్ కళశాల అనుమతి పొందాలని అని దినేష్ పేర్కొన్నారు.నాణ్యతమైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఉంటుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిగ్రి కాలేజ్ ప్రిన్సిపాల్ జహిరు, విద్యార్థిని,విద్యార్థులు కళశాల స్టాఫ్,వైద్య సిబ్బంది,వివిధ విద్యార్థి, యువజన సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube