పోస్టల్ పథకాలపై ఇంటింటా ప్రచారం

పోస్టల్ పథకాలపై ఇంటింటా ప్రచారం

1
TMedia (Telugu News) :

పోస్టల్ పథకాలపై ఇంటింటా ప్రచారం

టీ మీడియా,సెప్టెంబర్ 8, రాజన్న సిరిసిల్ల: పోస్టల్ శాఖలో అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, సుకన్య సమృద్ది ఖాతాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కరీంనగర్ సౌత్ సబ్ డివిజన్ పోస్టల్ శాఖ చేపట్టిన ఇంటింటా ప్రచారంలో భాగంగా బుధవారం రోజున మనువడ, మల్లాపూర్, కందికట్కూర్ , పోత్తుర్ గ్రామాలలో సుకన్య సమృద్ది , ఇతర పథకాలపై ప్రచారం నిర్వహించారు.

Also Read : దంపతుల ఆత్మహత్యపై సీఎం విచారణ

ఇందులో భాగంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి సుకన్య సమృద్ధి యోజన పథకం, రికరింగ్ డిపాజిట్ పథకం, సేవింగ్ పథకం, ఐపిపిబి, ఆర్పీఎల్ఐ, పిఎల్ఐ తదితర పథకాలు, ఖాతాలపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ సౌత్ ఐపిఓ రాజు మాట్లాడుతూ పోస్టల్ శాఖలో ప్రజలకు ఉపయోగపడే పలు పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వాటిని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ bpm చంద్రశేఖర్ , నర్సయ్య , భూమయ్య ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube