టీ మీడియా డిసెంబర్ 21 పెద్దశంకరంపేట,
పెద్దశంకరంపేట పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న 100 డబుల్ బెడ్రూం గృహల నిర్మాణ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరంపేట
పట్టణం తిర్మలాపురం శివారులో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం నిర్మాణపనులు, మోడల్ స్కూల్ వసతి గృహం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకవచ్చేలా చూడాలని
సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్
మండల అధ్యక్షులు మురళీ పంతులు, మండల రైతుబంధు అధ్యక్షులు సురేష్ గౌడ్, తదితరులున్నారు.