డబుల్ బెడ్ రూమ్స్ వెంటనే కేటాయించాలి
టి మీడియా. జూలై,30, పినపాక:సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ మద్దులగూడెం గ్రామస్తులు పలు సమస్యలను ఆయనకు తెలుసుకొని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని పేద ప్రజలు కు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని గత 8 సంవత్సరాల క్రితం సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ మద్దులగూడెం గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారని, కానీ వాటికి నేటికీ మౌలిక సదుపాయాలు అయిన రహదారులు, విద్యుత్తు లాంటి సౌకర్యాలు కల్పించి అర్హులైన పేదలకు కేటాయించలేదన్నారు.
Also Read : న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
దీనివల్ల సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని అనేకమంది పేదలు సరైన ఇండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు అయిన రహదారి, విద్యుత్తు లాంటి సౌకర్యాలు కల్పించి, అర్హులైన పేద ప్రజలుకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పినపాక మండల నాయకులు, చెట్టుపల్లి నాగేశ్వరరావు, గ్రామస్తులు. అందరూ పాలుగోన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube