తలసరి వృద్ది రేటు పెరుగుదల కేసీఆర్ ఘనతే
టిమీడియా, మార్చి2, ఖమ్మం: టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అద్భుతాలు సృష్టిస్తూ విజయపథంలో పయనిస్తున్నదని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అనతికాలం లో నే దేశంలో నే రికార్డు స్థాయిలో ఒక వైపు తలసరి ఆదాయం వృద్ధి రేటు లోనూ మరో వైపు జి.ఎస్.డి. పి లోనూ అగ్రగామిగా నిలవటం కెసిఆర్ పాలనా దక్షతకు నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశం లో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్నా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రాష…