గ్రామ సభకు హాజరైన జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య

గ్రామ సభకు హాజరైన జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య

0
TMedia (Telugu News) :

గ్రామ సభకు గ్రామ సభకు హాజరైన జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య

ములుగు జిల్లా వెంకటాపురం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జూన్ 3 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ముగిసింది. శనివారం జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభకు బర్లగూడెం లో హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పేర్కొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది అని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అన్నారు. పల్లె ప్రకృతి వనాలు , సెగ్రిగేషన్ షెడ్స్ , స్మశానవాటికలు , మన ఊరు మన నర్సరీ , క్రీడా స్థలాలు , గ్రామపంచాయతీ ట్రాక్టర్ , వాటర్ ట్యాంక్ వంటివి ఎన్నో గ్రామపంచాయతీ లకు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను సర్పంచ్ కొర్శా నర్సింహ మూర్తి ని ,బర్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి మౌనికను, ప్రత్యేక అధికారి రమాదేవి తో పాటు ఇంకొంతమందిని డిపిఓ వెంకయ్య, ఎంపిడివో అడ్డూరి బాబు సాల్వాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, పంచాయతి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube