ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ వర్ధంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ వర్ధంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ వర్ధంతి వేడుకలు

 

టీ మీడియా, జూలై 06, నంద్యాల:

నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ 36వ వర్ధంతి వేడుకలు బుధవారం నిర్వహించారు.ప్రజా నాయకుడు సీనియర్ న్యాయవాది తాటి రెడ్డి తులసిరెడ్డి, ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.స్థానిక విక్టోరియా రీడింగ్ రూమ్ ప్రధాన కూడలిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు. ఈ సందర్భంగా పూలే అంబేడ్కర్ జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది డాక్టర్ జి.బాలస్వామి మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ బాబు జగ్జీరావు గారి 36 వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్థానిక రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, కనీసం విగ్రహం వద్ద శానిటేషన్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం, అన్నారు. అదేవిధంగా సంవత్సరం క్రితం స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి విగ్రహం నిచ్చెన, మెట్ల ర్యాంపు ఏర్పాటు చేస్తానని చెప్పి 15 నెలలు దాటినప్పటికీ కూడా చేయకపోవడం శోచనీయం అన్నారు, అదేవిధంగా బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పట్టణంలో ప్రధాన కూడలిలో పెట్టడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో దళిత బహుజన సంఘాలకు అర్థం కావడం లేదని. రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో పాలకులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.ప్రజా నాయకుడు తులసి రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు ఇలాంటి మహానుభావులు దేశ పౌరులందరికీ నాయకులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గుర్తు చేశారు.ఆయన దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, తపాల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అలుపెరుగని నీతి నిజాయితీగా దేశానికి సేవలు చేస్తారన్నారు.

 

Also Read : పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ

ఏపీ ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మహానుభావుల విగ్రహాల పట్ల పాలకులు అధికారులు నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదని మీరు ఇలాగనే కొనసాగిస్తే మా ఆగ్రహం ఏందో చవిచూస్తారని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషు మాట్లాడుతూ బహుజన నాయకుల పట్ల నిర్లక్ష్యం చేయడం తగదని ఈ మహానుభావుల వర్ధంతి జయంతిలో ప్రభుత్వ అధికారులందరూ పాల్గొని నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు కాంట్రాక్టర్ మండ్ల గుర్రప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటేష్ , అంబేద్కర్ రాజ్యాంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు లెజెండ్ శ్రీనివాసులు, సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్, కృపానందం, కోయిలకుంట్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కత్తిసుబ్బయ్య మాదిగ, సిరివేల్ల అధ్యక్షుడు బాలయ్య మాదిగ, మహానంది మండల అధ్యక్షులు పి.మధు మాదిగ,సునీలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube