వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించ‌డం ప్ర‌ధానిపై టిఆర్ఎస్ పార్టీ స్పందన

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 19, చర్ల :

కేంద్రంలోని బిజేపి ప్ర‌భుత్వం రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించ‌డంపై తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టట్ తెల్లం వెంకట్రావు చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్సులకి ఆదేశాల ఇచ్చిన మేరకు సోయం రాజారావు, నక్కినబోయిన శ్రీనివాసరావు స్పందించారు. రైతుల సంక్షేమాన్ని మ‌రిచి, కార్పోరేట్ సంస్థ‌ల‌కు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అలుపెరుగ‌ని పోరాటాలు చేసిన రైతుల‌కు అండ‌గా సీఎం కేసిఆర్ నిలిచార‌ని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండ‌గా ముఖ్య‌మంత్రి కేసిఆర్ నిలిచార‌ని, కేంద్రం తీసుకొచ్చిన న‌ల్ల చ‌ట్టాల‌ను మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న‌ సియం కేసిఆర్ ఆదేశాల‌తో పార్ల‌మెంట్‌లో న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు బైకాట్ చేశార‌ని తెలిపారు.

రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగాన్ని అభివృద్ది చేస్తున్నార‌ని, రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టుల‌ను 24 గంటల కరెంట్ నిర్మించి రైతుల‌కు అండ‌గా ఉన్నారన్నారు. అదే స్పూర్తితో తెలంగాణ‌లో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు పోరాటం చేస్తామని, వ్య‌వ‌సాయం ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న క‌లిగిన నాయ‌కుడు మ‌న‌కు ముఖ్యమంత్రిగా ఉండ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల అదృష్టమ‌ని అన్నారు.

ఇప్ప‌టికైనా బిజేపి, పార్టీ నాయ‌కులు రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను వ‌దిలి, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు తెరాసా ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు, చర్ల మేజర్ పంచాయతీ, కేశవాపురం, గొమ్ముగూడెం సర్పంచ్లు కాపుల కృష్ణార్జున రావు, కోరం నాగేంద్ర, పొడెం మురళి, కేశవాపురం ఉపసర్పంచ్ గోసుల మురళి, పోట్రూ బ్రహ్మానందరెడ్డి, ఎస్ డి అజీజ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మండల బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, పాపిన గంగాధర్, పిఎసిఎస్ చర్ల డైరెక్టర్లు ముమ్మనేని అరవింద్, యాదాల రాంబాబు, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, తడికల లాలయ్య, మీడియా ఇంచార్జ్ పంజా రాజు, గారపాటి బాబీ, సింగ సంతోష్, వంటకాల మహేష్, కల్లూరి శ్రీను, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు…..

Bhadrachalam constituency in-charge Dr Tellam Venkatrao Charla Mandal TRS Party president and secretaries have responded to Soyam Rajarao’s.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube