ఐటీసీ విధానం తోబంగారు భవిష్యత్త

నాట్లు వేసే విధానానికి స్వస్తి

1
TMedia (Telugu News) :

ఐటీసీ విధానం తోబంగారు భవిష్యత్త
-నాట్లు వేసే విధానానికి స్వస్తి

టీ.మీడియా,ఆగస్ట్17,చింతూరు:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో డ్రమ్ సీడర్ ని ఉపయోగించి వరి విత్తనాలు విత్తడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి క్రిష్ణకాంత్ గమాట్లాడుతూ సాదారణ వరి సాగు చేసే అన్ని నెల రకాల్లో డ్రమ్ సీడర్ విధానం చేపట్టొచ్చు నాట్లు కోసం భూమిని సిద్ధం చేసుకుని, వీలైనంత వరకు భూమి చదునుగా ఉండేలా చూసుకోవాలి, విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 8 నుండి 12 కేజీ ల వరకు సరిపోతుందని ఈ విధానం వలన రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ విధానమును ప్రోత్సాహిస్తున్న ఐటీసీ బంగారు భవిష్యత్తు సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ల వారిని అభినందించడం జరిగింది.

Also Read : 21న ప్రత్యేక హరిత హరం

ఈ కార్యక్రమంలో
సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ సంస్థ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గణేష్ గారు, కమ్యూనిటీ ఆర్గనైజర్ అశోక్ గారు మరియు రైతులు హాజరు కావడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube