హస్తినకు చేరుకున్న ద్రౌపదీ ముర్మూ

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం

1
TMedia (Telugu News) :

హస్తినకు చేరుకున్న ద్రౌపదీ ముర్మూ

-ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం

టీ మీడియా, జూన్ 23,దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో దిగిన ద్రౌపదీ ముర్మూ హస్తినకు చేరుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి దేశ రాజధానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. దిల్లీ భాజపా ముఖ్య నేతలు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈరోజే ఆమె భువనేశ్వర్‌ నుంచి దిల్లీ చేరుకున్నారు. ఒడిశా భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న ద్రౌపది.. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ద్రౌపదితో సమావేశమైనట్టు ప్రధాని స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాల వారూ ప్రశంసించారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, దేశ అభివృద్ధి పట్ల విజన్‌ గొప్పదంటూ కొనియాడారు. అనంతరం ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు.

 

Also Read : వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

 

మరోవైపు, ద్రౌపది నామినేషన్‌ పత్రాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ నివాసంలో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ సంతకాలు చేసే వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్‌ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షాతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, భాజపా సీనియర్‌ నేతలు ఉన్నట్టు సమాచారం. అలాగే, ద్రౌపది అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన బిజూ జనతాదళ్‌ నుంచి సస్మిత్‌ పాత్రా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసేందుకు జోషీ నివాషం వద్ద ఉన్నారు. పలువురు అగ్రనేతల సమక్షంలో ద్రౌపదీ ముర్మూ తన నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. దిల్లీ బయల్దేరడానికి ముందు ఆమె భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అందరి సహకారం కోరతానన్నారు. ఓటర్లందరినీ (చట్టసభ్యులు) జులై 18లోపు కలిసి మద్దతు కోరనున్నట్టు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube