వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

2
TMedia (Telugu News) :

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

టీ మీడియా, మే 4, వనపర్తి బ్యూరో : రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద తండ్రి మిద్దె రాములు మొదటి వర్ధంతి సందర్భంగా స్థానిక సోనుసూద్ సరోజ వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పుట్టినరోజులు, వర్ధంతి, వివాహ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడితే సమాజంలో ఎంతో కొంత స్ఫూర్తి కలిగిన సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాను అని అన్నారు. అదే విధంగా ఒక రోజు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్,డి బాలరాజు, వడ్డే మురళి, ఆశ్రమ నిర్వాహకులు రాములు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నేటి నుండి జిల్లాలో ఎంపీ నామ పర్యటన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube