నవాబ్ పేట లో తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్22,చిట్యాల : చిట్యాల నుండి మొగుళ్లపల్లి మధ్యన డబల్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న మార్గమధ్యంలో ఉన్న నవాబుపేట గ్రామంలో తాగునీటి కోసం వేసిన పైపులు రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా తాగునీటి కోసం వేసిన పైపులు పగిలిపోయాయి. పగిలిపోయిన పైపుల స్థానంలో కొత్త పైపులు వేయకపోవడంతో తాగునీటి కోసం గ్రామస్తులు మూడు రోజుల నుండి తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే స్పందించి కొత్త పైపులు వేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube