మంచినీటి కుంభ కోణం

పనిచేయని మిషన్ భగిరద

1
TMedia (Telugu News) :

మంచినీటి కుంభ కోణం

– పనిచేయని మిషన్ భగిరద

-10 రోజుల కొకసారి పంపులు

– ఇళ్ళ మధ్య వాటర్ ప్లాంట్లు

టీ మీడియా,నవంబర్ 7,ఖమ్మం సిటీ బ్యూరో : నగరాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం ద్వారా మహానగరం సరసన నిలిపే పనిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి చేస్తున్నారు.మరో వైపు కొంతమంది చేస్తున్న పనులు చెడ్డ పేరు తెస్తున్న యి. నగర పాలక సంస్థ పరిధి లో కొత్త తరహా మంచి నీటి కుంభకోణం కు కొంతమంది తెరలేపారు.నీటి వ్యాపారులు తో కుమ్మక్కయి త్రాగు నీరు కొనుక్కొనే లాగా చెయ్యడం ద్వారా పరోక్ష సహకారం అందిస్తున్నారు.అందులో భాగంగా నే కొన్ని ప్రాంతాల్లో మిషన్ భ పని చేయక పోవడం,22 వ డివి జన్ లో 10 రోజులు అనంతరం సోమవారం మున్సిాలిటీ పంపులు రాక పోవడం అనేది తెలుస్తోంది.4 నెలలు గా ఈ డివిజన్ లో ఎప్పుడు,ఎన్ని రోజులు కు మున్సిపల్ ట్యాప్ లు వస్తాయి తెలియని దుస్థితి ఉంది. ఈ ప్రాంతం లో 4 వాటర్ ప్లాంట్ లు ఉన్నయి. నగరం లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

రాష్ట్ర రాజధాని తరువాత స్థాయి లో ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా నివాసాలు ,జన సాంద్రత పెరిగింది.ఇవి అన్నీ అసరా చేసుకొన్న కొంత మంది అన్ని వ్యాపారాలు తో పాటు నీటి వ్యాపారం కు తెర లేపారు.గతం లో ఉన్న వాటి లో కొన్నిం టి పైన ఆరోపణలు ఉన్నయి.అవి కాకుండా శుద్ది చేసిన,మినరల్ వాటర్,స్వచ్ఛ మైన నీటి ప్లాంట్ల పుట్టుకు వచ్చాయి.ఇవి నివాసాలు మధ్య,నివాస గృహాల్లో నే ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్న రు. ఏటువంటి అనుమతులు లేకుండా రోజువారీ 20 నుండి 50 వెలు వరకు నెలకు 10 నుండి,15 లక్షలు వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతి లు కూడా లేవు. జి ఏస్ టి లాంటి వి అసలు ఉండవు క్వాలిటీ అనేది అనుమానం గా ఉంది.అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించు కొకపోగా , వాటర్ ప్లాంట్ లు వారితో కుమ్మ క్కు అయ్యారు అనే ఆరోపణలు ఉన్నయి.

Also Read : 11 గంటలపాటు శ్రీవారి ఆలయం బంద్‌

భూగర్భ జలం హాం ఫట్
వాటర్ ప్లాంట్ లు మూలంగా బూ గర్భ జలాలు కూడా పోతున్నయి.వందల అడుగుల బోర్లు వేస్తున్నారు.ఇంటి అవసరాలు కోసం ఉన్న విద్యుత్ కనెక్షన్ లు కి బోరు మోటార్లు ఏర్పాటు చేస్తున్న రు.అయిన అతు వైపు చూసే వారు లేరు
22 వ డివిజన్ లో..
ఈ ప్రాంతం లో గతం లో రోజు విడిచి,రోజు పంపులు వచ్చేవి ఆ నీళ్ళు సమృద్ది గా సరింపోయేవి.ఉదయం 6 గంటలకు వచ్చే పంపులు సమయం 6 నెలల క్రితం హఠాత్తుగా మారింది.ఎప్పుడు వస్తాయి అసలు వస్తాయా,వస్తె ఎంత సేపు వస్తాయి అన్నది తెలియని దుస్థితి ఏర్పడింది దీనితో జనం త్రాగు నీటిని వాటర్ ప్లాంట్ లో కొనుగోలు చేసుకొంటున్నారు. సగటున ఓ క్క కుటుంబం రోజుకు 50 రూపాయలు మంచి నీటి కొనుగోలు కు ఖర్చు చేస్తున్నారు.ఈ ప్రాంతం లో మున్సిపల్ నీరు సక్రమంగా రాని ఫలితంగా గడిచిన 6 నెలల్లో నెలకు 5 లక్షలు రూపాయలు ఈ ప్రాంత వాసులు ఖర్చు చేశారు అని టి మీడియా పరిశీలన లో తెలిసింది.నగరం మొత్తం చూస్తే కోట్లలో నెల వారీ మంచి నీటి వ్యాపారం ఉంది

పని చేయని మిషన్ భగీరధ

కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించాలి అని ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పదకం మున్సిపాల్టీ లోని అక్రమార్కులు వల్ల నీరు గారిబోతోంది .కొన్ని.చోట్ల ఖాళీ ప్లాట్ల లో కూడా నగరం లో భగీరథ కనెక్షన్లు ఉన్నయి.వాటికి నీటిని వదులు తున్నరు మామూళ్ల గూడెం లాంటి చోట ప్రముఖులు ఇళ్ళ కు కొన్ని చోట్ల మూడు వరకు నిబంధనలకు విరుద్ధం గా కనెక్షన్లు ఇచ్చారు.నీళ్ళు ఇస్తున్నారు. ముస్తఫానగర్,సం నగర్ లాంటి చోట కనెక్షన్లు ఉన్న నీరు రావడం లేదు.ఇటువంటి వి అనేకం నగర పాలక పరిధిలో మున్సిపల్ నీరు కుంభ కోణం తెలియ చేస్తోంది.(మరి కొన్ని వివరాలు మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube