డ్రైవర్లు తప్పక ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి
– అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత
టీ మీడియా, జనవరి 23, చింతూరు : చింతూరు మండల కేంద్రము లో జాతీయ రహదారి భద్రతా వారత్సవాలలో భాగంగా లారీ , టాక్టర్, ఆటో డ్రైవర్లు లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత మాట్లాడుతూ డ్రైవర్లకు ప్రభుత్వ నిబంధనలతో కూడిన సూచనలు తెలియజేశారు.అందులో ముఖ్యముగా డ్రైవర్లు అందరూ తప్పని సరిగా లైసెన్సు కలిగి ఉండాలని మరియు వాహనములు నడిపేటప్పుడు మద్యం తాగి నడపరాదని మరియు ప్రమాదకరమైన ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన సైన్ బొర్డులు మరియు సిగ్నల్స్ గురించి వారికి అవగాహన కల్పించి ఆటోలు మేజిక్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని అవగాహన కార్యక్రమం లో తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆటో మేజిక్ లారీ యునియన్స్ నాయకులు మరియు వాహనాలు డ్రైవర్లు పాల్గొన్నారు.